భారత వైమానిక దళం (IAF) 2025 మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులపై భారీ దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైన ఈ వీడియో భారత్ యొక్క శక్తివంతమైన వైమానిక సామర్థ్యాలను ప్రపంచానికి ప్రదర్శించింది. వీడియోలో బ్రహ్మోస్ క్షిపణి దాడులు, భారత సైన్యం ప్రణాళిక, దళాల సమీకరణం, ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలు ఉన్నాయని సమాచారం.
వీడియోలో భారత్ తన భద్రతకు ముప్పు కలిగించే చర్యలను ఖండిస్తూ, ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచిన వారిని వెంబడించి శిక్షిస్తామని స్పష్టం చేసింది. "భారత్ ఏదీ మర్చిపోలేదు, దేనినీ క్షమించదు" అనే సంకేతం కూడా ఈ వీడియోలోని ప్రధాన సందేశం.
2025లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ వీడియో ద్వారా IAF తన భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై మరింత కఠిన వైఖరి తీసుకుంటుందని పునరుద్ఘాటించింది.
ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం: IAF శక్తివంతమైన వీడియో
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan