అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ చర్చలు సాధారణ దౌత్య సమావేశాలు కావు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సమయంలో, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ హై-లెవెల్ టాక్స్ ప్రారంభం కానున్నాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో బృందం చేరుకోగా, ఇరాన్ నుంచి కీలక ప్రతినిధులు ఇప్పటికే పాల్గొనడానికి సిద్ధమయ్యారు.
ఈ చర్చల ప్రధాన లక్ష్యం యుద్ధాన్ని పూర్తిగా ఆపడం, హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, అణు కార్యక్రమంపై స్పష్టత ఇవ్వడం, అలాగే ఆంక్షల సడలింపులపై ఒప్పందం కుదుర్చుకోవడం. కానీ చర్చలు మొదలయ్యే ముందు నుంచే రెండు దేశాల మధ్య తీవ్ర అవిశ్వాసం కనిపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే చర్చలు జరగవని ఇరాన్ షరతులు పెట్టడం పెద్ద అడ్డంకిగా మారింది.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెంచాయి. చర్చలు విఫలమైతే భారీ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని, నౌకాదళాన్ని ఇప్పటికే అలర్ట్‌లో ఉంచామని ఆయన వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి గ్లోబల్ ఆయిల్ సరఫరాకు కీలక మార్గం కావడంతో, ఇది మూసుకుపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే దెబ్బ తగిలే పరిస్థితి ఉంది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన ఈ చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాంతికి మార్గం సుగమం అవుతుంది. లేకపోతే యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే ఈ టాక్స్‌ను “మెక్ ఆర్ బ్రేక్” చర్చలుగా అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పాక్‌లో అమెరికా-ఇరాన్ కీలక టాక్స్.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్, యుద్ధ ముప్పు?
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan