కవి, కవిసామ్రాట్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య కళా వేదికలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ గుర్రం జాషువా తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు.
సామాజిక చైతన్యానికి తమ రచనల ద్వారా కృషి చేసిన ప్రముఖుల జయంతి వేడుకలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాలకు గుర్రం జాషువా సాహిత్యం, ఆయన ఆలోచనలు, ఆశయాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సాహితీవేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు కొమ్మవరపు, గడ్డం ఈశ్వరమ్మలకు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సాహితీ పురస్కారాలను అందజేశారు.
కళలు, కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో కళా రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.
జాషువా జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, కళాకారులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. ఆయన రచనలను, సామాజిక సందేశాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
గుర్రం జాషువా కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు: మంత్రి దుర్గేశ్
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan