అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ మరియు రోహిత్ శర్మ కలిసి ప్రపంచకప్ ట్రోఫీని గ్రౌండ్‌లోకి తీసుకొచ్చారు. 2007లో ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ నేతృత్వంలో భారత్ టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఇద్దరు ‘ఛాంపియన్ కెప్టెన్లు’ ఒకే ఫ్రేమ్‌లో కప్పుతో కనిపించడంతో స్టేడియం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. అభిమానులకు ఇది ప్రత్యేక క్షణంగా నిలిచింది.
ఒకే ఫ్రేమ్‌లో ధోనీ – రోహిత్… స్టేడియం మార్మోగింది
2
Published on: 📅 09 Mar 2026, 09:59 AM
Reporter: 🖊 Suresh Reddy