హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, హాస్టళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరఫరా తగ్గడంతో పలు హోటళ్లు మెనూను కుదించగా కొన్ని చోట్ల ధరలు కూడా పెరిగాయి. హాస్టళ్లలో దోశ, పూరీ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేసి భోజనం మాత్రమే అందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భోజనం అందించడం కూడా కష్టమవుతుందని యజమానులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.