కమర్షియల్ గ్యాస్ కొరత, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏపీ హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించింది. గ్యాస్ సమస్యలు కొనసాగితే స్టార్ హోటళ్లలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు మూసివేయాలని నిర్ణయించింది. పరిస్థితి ఇలా కొనసాగితే కర్ణాటక తరహాలో కొన్ని హోటళ్లు కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రావచ్చని తెలిపింది.