దేశ రాజకీయాలను కుదిపేలా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రారంభ దశలోనే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనుకంజలో ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ తమిళనాడులో స్టాలిన్ కేరళలో పినరయి విజయన్ తమ తమ నియోజకవర్గాల్లో ఆధిక్యం కోల్పోయినట్లు సమాచారం.
ఇక తమిళనాడులో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. టీవీకే పార్టీ అనూహ్యంగా ముందంజలో దూసుకుపోతోంది. 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించడం రాజకీయంగా పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యకు దగ్గరగా చేరుకోవడం ఈ పార్టీకి భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
డీఎంకే పార్టీ మూడో స్థానానికి పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. స్టాలిన్ తో పాటు ఆయన తనయుడు కూడా వెనుకంజలో కొనసాగడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. ప్రజలు ప్రస్తుత పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీవీకే నేతలు ప్రజలు తమపై నమ్మకం ఉంచారని చెబుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫలితాలు కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజల తీర్పు మార్పు వైపు మొగ్గుచూపుతోందని ఈ ట్రెండ్ స్పష్టంగా తెలియజేస్తోంది.
మూడు ముఖ్యమంత్రులు వెనుకంజ టీవీకే దూసుకుపోతోంది
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan