చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు రేపు మూతపడనున్నాయి. తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 వరకు దర్శనాలను నిలిపివేయనున్నారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను ఉదయం 7 గంటలకే మూసివేసి, బుధవారం తిరిగి తెరవనున్నట్లు యాజమాన్యం తెలిపింది. రేపు జరగాల్సిన హోలికోత్సవాన్ని ఈరోజే సాయంత్రం నిర్వహించనున్నారు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం దర్శనాలు యథావిధిగా కొనసాగనున్నాయి. భక్తులు ముందస్తు సమాచారం తెలుసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
చంద్రగ్రహణం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూత
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 తెలంగాణ