తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ అంశంపై వ్యాఖ్యలు చేయకుండా ఆపాలని మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ వ్యాఖ్యలపై సీబీఐ దర్యాప్తు జరగలేదని ఆయన పేర్కొన్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కోర్టు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే సిట్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సీబీఐ ముందు చెప్పాలని కోర్టు సూచించింది.
తిరుమల లడ్డూ కేసులో పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
9
Published: 📅
Reported by: 🖊
Ramesh Kumar