అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతంలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతంలో బుర్జ్ ఖలీఫా సహా ప్రముఖ భవనాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. దుబాయ్‌పై జరిగిన దాడులను తిప్పికొట్టేందుకు యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ప్రాంతాల్లో కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం.