అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు కానున్న ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన తేదీ ఖరారైంది. ఈ నెల 23న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. మొత్తం రూ.1.5 లక్షల కోట్ల అంచనాతో ప్లాంట్ నిర్మాణం జరగనుందని వెల్లడించారు. తొలి విడతలో రూ.80 వేల కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
నక్కపల్లిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 అనకాపల్లి