రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రజల్లో ఆందోళన కారణంగా ఎక్కువమంది ముందుగానే సిలిండర్లు బుక్ చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుటుంబ అవసరాలకు గ్యాస్ లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.
గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తం.. ఓటీపీతోనే సిలిండర్ పంపిణీx`
7
Published: 📅
Reported by: 🖊
Suresh Reddy