పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరా ఈడీ విచారణలో చిక్కుకున్నారు. ఆయనపై రూ.150 కోట్ల పన్ను ఎగవేశారనే అభియోగాలు ఉన్నప్పటికీ, ఈడీ అధికారులు శనివారం ఆయనను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఇంతకుముందు ఢిల్లీ, చండీగఢ్, గురుగ్రామ్‌లో ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం, కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.
అరోరా హ్యాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో గత నెలలోనే అరోరాను ప్రశ్నించినా, ఆయన దర్యాప్తుకు సహకరించకపోవడంతో శనివారం అరెస్టు చేశారు.
ఈ అరెస్టుపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కుట్ర పన్ని, ఈడీ దాడులు నిర్వహించిస్తున్నట్లు వారు ఆరోపించారు.
ఈడీ అరెస్టు చేసిన పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati