పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశానికి చాలా విధాలుగా భారం పడుతుంది. ఈ నేపధ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ పొదుపు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8 కీలక సూచనలను అమలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు మాట్లాడుతూ, పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించి, ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
ప్రధాని మోదీ సూచించిన ప్రకారం, పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాలను తగ్గించుకోవాలని, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని, సెక్యూరిటీ కుదించుకోవాలని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే, విదేశీ పర్యటనలను తగ్గించాలని, మన దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రజలను ప్రోత్సహించారు.
‘నా దేశం నా బాధ్యత’ అనే భావనను ప్రజలు ఆచరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజలు బంగారం కొనడాన్ని తగ్గించాలని, ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నిర్ణయాలు రెండు రోజుల్లో అమలు చేయాలని, ప్రభుత్వ పరంగా కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక పొదుపు చర్యలు
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan