కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో టీవీకే చీఫ్ విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 12, 19 తేదీల్లో సీబీఐ ఇప్పటికే విజయ్‌ను విచారించింది. తాజా నోటీసుతో ఆయన మరోసారి విచారణకు హాజరుకానున్నారు.