andhra pradesh adulterated milk incident critical patients

కల్తీ పాలు ఘటన: ఏపీలో 7 మంది పరిస్థితి విషమం

1

Published on: 📅 01 Jan 1970, 05:30 AM
Reporter: 🖊

కల్తీ పాలు తాగిన ఘటనలో **రాజమండ్రి**లో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ కళ్యాణ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ముగ్గురు వెంటిలేటర్‌పై, ఇద్దరు డయాలసిస్‌పై, మరో ముగ్గురు వెంటిలేటర్-డయాలసిస్‌పై ఉన్నారు. బాధితుల్లో ఐదు నెలల శిశువుతో సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. అవసరమైన ప్రత్యేక మందులను చెన్నై, ముంబై నుంచి తెప్పిస్తున్నట్లు తెలిపారు.

Sponsored