హర్మూజ్ జలసంధి ఉద్రిక్త పరిస్థితుల మధ్య రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు సురక్షితంగా దాటాయి. ‘శివాలిక్’, ‘నందాదేవి’ నౌకలు సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీతో గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్చి 16 లేదా 17న భారత్కు చేరుకునే అవకాశం ఉందన్నారు. దేశంలో గ్యాస్ కొరతపై ఆందోళనల మధ్య ఈ పరిణామం ఊరటనిచ్చింది. గృహ వినియోగ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్రం స్పష్టం చేసింది.
హర్మూజ్ దాటిన రెండు ఎల్పీజీ నౌకలు.. భారత్కు 92 వేల టన్నుల గ్యాస్ రాక
9
Published on: 📅 14 Mar 2026, 06:05 PM
Reporter: 🖊 Ramesh Kumar