ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ విజయవాడలో ఘనంగా జరిగింది. పోరంకి మురళీ రిసార్ట్‌లో జరిగిన కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జయరాం సమాజ సేవ, ఎన్ఆర్ఐల కోసం చేసిన కృషి ప్రశంసనీయమని రమణ అన్నారు. అమెరికాలో ఏ తెలుగువాడికి సమస్య వచ్చినా జయరాం ముందుంటారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఏపీ ఉత్తర అమెరికా ప్రతినిధిగా కోమటి జయరాం.. ఘన సన్మాన సభ
16
Published on: 📅 14 Mar 2026, 05:58 PM
Reporter: 🖊 Kiran Rao