బీసీసీఐ నమన్ అవార్డులు ప్రకటింపు.. ద్రవిడ్, బిన్నీ, మిథాలీకి లైఫ్‌టైమ్ గౌరవం

8

Published on: 📅 14 Mar 2026, 05:45 PM
Reporter: 🖊 Anitha Sharma

2024–25 సీజన్‌కు సంబంధించిన నమన్ అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌లకు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించారు. టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రతిష్ఠాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డు లభించింది. భారత క్రికెట్‌కు వీరు అందించిన సేవలకు గాను ఈ గౌరవాలు ప్రకటించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ అవార్డులు క్రికెట్ రంగంలో వారి విశిష్ట కృషికి గుర్తింపుగా నిలిచాయి.

Sponsored