చమురు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యూబాకు యునైటెడ్ స్టేట్స్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి బయల్దేరిన చమురు నౌకకు క్యూబాకు చేరేందుకు అనుమతినిస్తూ అమెరికా తాజాగా ప్రకటన చేసింది. గతంలో విధించిన ఆంక్షలను కొంతవరకు సడలించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
సుమారు 7.3 లక్షల బ్యారెళ్ల ముడిచమురుతో రష్యా నౌక ‘అనాటోలీ కొలోడ్కిన్’ మార్చి 8న రష్యా పోర్ట్ నుంచి బయల్దేరింది. ఈ నౌక ఇంగ్లీష్ ఛానల్ మీదుగా అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించింది. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ నౌక క్యూబాను చేరుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంలో డోనాల్డ్ ట్రంప్ సూచనతో, “ఇప్పటికిప్పుడు క్యూబాకు చమురు సరఫరా చేయడానికి ఏ దేశం అనుకున్నా దానిపై నాకు అభ్యంతరం లేదు” అని తెలిపారు. ఆ తర్వాత అమెరికా అధికారులు కూడా రష్యా నౌకకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం క్యూబాని కొంతమేర నిరుపమాన పరిస్థితి.
క్యూబాలో చమురు సంక్షోభం తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఇంధన కొరత కారణంగా బస్సులు, ఇతర రవాణా సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి.
ఇదిలా ఉండగా, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో పై చర్యల తర్వాత ఆ దేశం నుంచి క్యూబాకు చమురు సరఫరా దాదాపుగా ఆగిపోయింది. దీంతో క్యూబా పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది.
గతంలో డోనాల్డ్ ట్రంప్ క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఒక దశలో క్యూబాను స్వాధీనం చేసుకుంటానని చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంక్షలు సడలించడం వ్యూహాత్మక నిర్ణయంగా.
రష్యా నుంచి వస్తున్న ఈ చమురు సరఫరా క్యూబాలో ఇంధన కొరతను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారం కావాలంటే స్థిరమైన సరఫరా మార్గాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
క్యూబాకు ఊరట.. అమెరికా ఆంక్షల్లో సడలింపు
8
Published on: 📅 30 Mar 2026, 01:25 AM
Reporter: 🖊 Venkat Bhanu