pawan kalyan interacts with tribals during nandigaru visit

గిరిజనుల సమస్యలు తీర్చడమే లక్ష్యం.. నందిగరువులో పవన్ కల్యాణ్

5

Published on: 📅 14 Mar 2026, 06:07 PM
Reporter: 🖊 Anitha Sharma

అల్లూరి సీతారామరాజు జిల్లా నందిగరువులో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజనులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సరైన రహదారులు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను చూసి రహదారి నిర్మాణానికి ముందుకొచ్చామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఓనూరులో జల జీవన్ మిషన్ కుళాయిని పరిశీలించి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు బ్యాగులు, గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.

Sponsored