అమరావతి రాజధానిలో నిర్మించనున్న బిట్స్ పిలానీ క్యాంపస్‌కు సంబంధించిన ప్లాన్లను మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు క్యాంపస్‌లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు. రెండు దశల్లో సుమారు 7 వేల విద్యార్థులకు అవకాశాలు కల్పించేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
అమరావతిలో బిట్స్ పిలానీ ఏఐ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన లోకేశ్
15
Published on: 📅 13 Mar 2026, 05:15 PM
Reporter: 🖊 Ramesh Kumar