హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఆయిల్ సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన దాడుల కంటే 20 రెట్లు బలంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ మౌలిక వసతులను తిరిగి కోలుకోలేని స్థాయిలో ధ్వంసం చేస్తామని తెలిపారు. అయితే అలాంటి పరిస్థితి రాకూడదని ఆశిస్తున్నానన్నారు. చైనా సహా హార్ముజ్ మార్గంపై ఆధారపడిన దేశాలకు ఇదే తన సందేశమని వ్యాఖ్యానించారు.