రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. సమయాభావం కారణంగా ప్రస్తుతం సమావేశం సాధ్యం కాదని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. పశ్చిమబెంగాల్‌లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేయడానికి 12 మంది సభ్యులతో టీఎంసీ బృందం అపాయింట్‌మెంట్ కోరింది. అయితే వచ్చే వారం అయినా సమయం కేటాయించాలని కోరుతూ మరో లేఖ పంపినట్లు సమాచారం. ఇటీవల బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం చర్చకు దారితీసింది.
రాష్ట్రపతిని కలవాలనుకున్న టీఎంసీ నేతలకు నిరాశ.. అపాయింట్‌మెంట్ లభించలేదు
6
Published: 📅
Reported by: 🖊
Kiran Rao