భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఎప్పుడూ భారీ క్రేజ్ ఉంటుంది. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తు చేసి అభిమానుల హృదయాలు గెలుచుకుంది. సహల్గాం ఉగ్రదాడి బాధితులకు గెలుపు అంకితం చేస్తూ పాక్ ఆటగాళ్లతో కరచాలనం కూడా చేయకపోవడం విశేషం. దీనిపై పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. యూఏఈ మ్యాచ్ బహిష్కరిస్తామని బెదిరించినా చివరికి క్షమాపణలతో ఆడింది. యూఏఈని ఓడించి సూపర్ 4లోకి అడుగుపెట్టింది. అయినా పాక్ మాజీలు, పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.