అంతర్జాతీయ మార్కెట్లో నిన్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. బంగారం ధర 11 శాతం, వెండి ధర 32 శాతం తగ్గింది. గురువారం ఔన్స్ బంగారం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో $5,595 (రూ.5.13 లక్షలు)కి చేరగా, శుక్రవారం $4,722 (రూ.4.32 లక్షలు)కు తగ్గింది. అదే విధంగా ఔన్స్ వెండి ధర $121.67 నుంచి $79.30కి పడిపోయింది. డాలర్ బలోపేతం, ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌గా కెవిన్ వార్ష్ నామినేషన్, అమ్మకాలు పెరగడం, కొనుగోళ్లు తగ్గడమే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.