U19 వరల్డ్‌కప్‌లో రేపు జింబాబ్వే వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం ఇండియా–పాక్ మధ్య పోటీ కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో భారత్‌కు 6, పాకిస్థాన్‌కు 4 పాయింట్లు ఉన్నాయి. టీమిండియా రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో పాక్ సెమీస్ చేరాలంటే కనీసం 105 పరుగుల తేడాతో గెలవాలి. ఛేజింగ్‌లో ఉంటే 251 పరుగులను 29.4 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
U19 వరల్డ్‌కప్ సెమీస్ బెర్త్ కోసం ఇండియా–పాక్ కీలక సమరం
Published on: 📅 31 Jan 2026, 09:30