విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్న వచ్చేశాడోచ్’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ కనిపించకపోవడంతో ‘యూజర్ నాట్ ఫౌండ్’ అని చూపించడమే ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగించింది. ఇది టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పటివరకు విరాట్ కోహ్లీ లేదా ఇన్‌స్టాగ్రామ్ అధికారికంగా స్పందించలేదు.