ఇటీవల వరకు సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన అభిమానులే ఇప్పుడు అతడి ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఫుట్‌వర్క్ బలహీనంగా ఉందని, వికెట్లను వదిలేసి క్లీన్ బౌల్డ్ అవుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 40 పరుగులే చేయడంతో విమర్శలు మరింత పెరిగాయి.