అజిత్

అజిత్ పవార్ అంత్యక్రియలు నేడు: బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు

Published on: 29-01-2026

ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు నేడు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఏపీ మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందారు.

Sponsored