ఏకాదశి ఉపవాసం దశమి రోజే ప్రారంభమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దశమి రోజున మాంసాహారం త్యజించి, సాయంత్రం తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి శ్రీమహావిష్ణువును భక్తితో పూజించాలి. వీలైనంతవరకు నిరాహారంగా ఉండటం ఉత్తమం. శక్తిలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. నిరాహారం సాధ్యంకాకపోతే మౌనవ్రతం పాటించడం శ్రేయస్కరం. ద్వాదశి రోజున తులసి తీర్థంతో ఉపవాసాన్ని విరమించాలి.