రోషన్ హీరోగా, అనస్వర–అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛాంపియన్’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. స్పప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ‘గిర గిర గింగిరాగిరే’ పాట ఈ చిత్రానిదే.