తిరుమల

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు: జంతు కొవ్వు లేదని NDDB నివేదిక

Published on: 29-01-2026

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆ నెయ్యిలో కొలెస్ట్రాల్ లేనట్లు NDDB నివేదికలో తేలిందని, దీంతో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే పాలు లేదా వెన్నను ఉపయోగించకుండా రిఫైన్డ్ పామాయిల్, బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలతో నెయ్యిలాంటి పదార్థాన్ని తయారు చేసినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

Sponsored