సాఫ్ట్‌వేర్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు రాజీనామా… గ్రూప్-2లో తాడిపత్రి దంపతుల డబుల్ విజయం

Published on: 29-01-2026

తాజా ఏపీ గ్రూప్-2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దంపతులు విశేషంగా రాణించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి కఠినంగా సిద్ధమయ్యారు. వారి కృషికి ఫలితం దక్కింది. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగాలు రావడంతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.

Sponsored