T20 వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ బెదిరింపులకు దిగుతుండటంతో ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు సరదాగా ట్రోల్ చేసింది. పాక్ స్థానంలో తామే టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ‘వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ఆడుతుందో లేదో త్వరగా స్పష్టం చేస్తే మంచిది. ఫిబ్రవరి 2న వారు వైదొలిగితే మేము వెంటనే బయలుదేరేందుకు రెడీ. ఫిబ్రవరి 7 నాటికి కొలంబో చేరుకోవడం కష్టమవుతుంది’ అంటూ ఐస్‌ల్యాండ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.