సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి విభేదించగా, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిన్మయి చెప్పింది నిజమేనని ఆయన వ్యాఖ్యానించారు. పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి ఉందని, అయితే అందరూ వేధింపులకు పాల్పడటం లేదని స్పష్టం చేశారు. ఏడాదికి సుమారు 250 సినిమాలు నిర్మితమవుతుంటే, 30–40 చిత్రాలు మహిళలను వాడుకునే ధోరణితోనే తీస్తున్నవని అన్నారు. ఇది కాదనలేని వాస్తవమని పేర్కొన్నారు.
క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ: చిన్మయి వ్యాఖ్యలకు తమ్మారెడ్డి భరద్వాజ మద్దతు
Published on: 30-01-2026