2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన సంభవించనుంది. హోలీ పౌర్ణమి రోజున జరిగే ఈ గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి రావడం వల్ల ఈ ఖగోళ అద్భుతం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2026లో మొత్తం రెండు గ్రహణాలు సంభవించనున్నాయని ఖగోళ నిపుణులు వెల్లడించారు. రెండో చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది.