అమరావతిలో

అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్: CRDAతో భూ విక్రయ ఒప్పందం పూర్తి

Published on: 📅 31 Jan 2026, 05:59

తుళ్లూరు మండలం రాయపూడిలోని CRDA కేంద్ర కార్యాలయంలో శుక్రవారం AP CRDAతో బిట్స్ సంస్థ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల్లో బిట్స్ సంస్థకు భూమిని కేటాయించింది. అమరావతిలో మొత్తం 70.011 ఎకరాల విస్తీర్ణంలో బిట్స్ పిలానీ యూనివర్సిటీ తన ఆధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో రాజధాని ప్రాంతానికి విద్యా రంగంలో కొత్త ఊపు రానుందని, జాతీయ స్థాయి విద్యాసంస్థగా అమరావతి గుర్తింపు పొందుతుందని భావిస్తున్నారు.

Sponsored