యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి, ఫస్ట్ వీక్‌లో రూ.112 కోట్లు వసూలు చేసింది. వరుసగా రెండోసారి తేజ ఈ ఘనత సాధించాడు. అయితే, ఈ మూవీలో విలన్‌గా నటించిన మంచు మనోజ్ ఆకట్టుకున్నాడు. అతని పాత్రలో ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకర్షించాయి. కొన్ని సీన్స్‌లో హీరోని కూడా డామినేట్ చేశాడు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత వచ్చిన ‘మిరాయ్’ విజయం మనోజ్‌కి బూస్ట్‌గా నిలిచింది. విమర్శకులు, ప్రేక్షకులు అతని ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తున్నారు.
యూఎస్‌లో ‘మిరాయ్’ టీమ్.. మంచు మనోజ్ మళ్లీ మిస్సింగ్, కావాలనే పక్కనపెట్టారా?
Published on: 20-09-2025