ఆమిర్ ఖాన్ 30 ఏళ్లుగా కలలు కంటున్న మహాభారతం సినిమా గురించి తాజా వివరాలు వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, యజ్ఞంలా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కి మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు మొదలవుతాయని చెప్పారు. మహాభారతం కథను ఒకే భాగంలో చూపడం సాధ్యం కాదని, అందుకే సిరీస్‌లుగా అందించనున్నట్లు పేర్కొన్నారు. భారీస్థాయిలో నిర్మితమయ్యే ఈ చిత్రానికి అనేక మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారని, కథ పూర్తి అయిన తర్వాత నటీనటుల ఎంపిక చేపడతామని వెల్లడించారు.