న్యూఢిల్లీ, మే 20: మార్కెట్లో నకిలీ మందుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మందులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండటమే అత్యవసరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన మందుల స్థానంలో నకిలీ మందులు వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.
మందులను పరిశీలించే మొదటి దశలో, మందుల పేరు, స్పెల్లింగ్, బ్యాచ్ నంబర్, తయారీ మరియు గడువు తేదీలను తప్పకుండా చూడాలి. పేరులో అక్షర దోషాలు ఉంటే అది నకిలీ అయి ఉండే అవకాశం ఉంది.
రెండవది, కంపెనీ లోగోను పరిశీలించడం. ప్రతి ఔషధ కంపెనీకి ప్రత్యేక లోగో ఉంటుంది. ప్యాకెట్‌లో ఉన్న లోగోను అధికారిక లోగోతో పోల్చి చూడాలి. చిన్న మార్పులు, లోపాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి.
కొన్ని మందులపై ప్రభుత్వం QR కోడ్ ను తప్పనిసరి చేసింది. ఫోన్ ద్వారా స్కాన్ చేయగలిగితే, మందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. వివరాలు సరిపోకపోతే జాగ్రత్త పడాలి.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా కొనుగోలు చేసిన మందులను కూడా అవసరమైతే మళ్లీ వైద్యులను సంప్రదించడం మంచిది.
మూడవది, మందుల నాణ్యత. క్యాప్సూల్స్ జిగటగా మారడం, టాబ్లెట్స్ పొడిగా మారడం, సిరప్ సీల్ తెరిచి ఉండడం వంటి లక్షణాలు ఉంటే వాడకూడదు.
ఎప్పుడూ లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే మందులు కొనాలి. బిల్లు తప్పక తీసుకోవాలి.
చివరిగా, మందుల గడువు తేదీని సరిచూసుకోవాలి. త్వరలో గడువు ముగిసే లేదా ఇప్పటికే ముగిసిన మందులు ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. ఈ సూచనలను పాటించడం ద్వారా నకిలీ మందులు వాడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు
టాబ్లెట్స్ కొనేముందు తెలుసుకోవాల్సిన ముఖ్యసూచనలు
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan