తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యం సాధించే వరకు వదిలిపెట్టరని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం తీసుకొచ్చిన ‘స్వయం’ బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. మహిళలకు అప్పులు ఇప్పించే బాధ్యత తనదని, వాటిని సద్వినియోగం చేసుకోవడం వారి పని అని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష మందిని దాటారని, ఏడాదిలో మరో ఐదు లక్షల మందిని తయారుచేస్తామని చెప్పారు.