భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌షిప్ చేసిన కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయని మార్కెట్‌లో ఒక నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. టీమ్ఇండియాకు మొదటిసారి స్పాన్సర్ చేసిన ఐటీసీ నుంచి ఇటీవల తప్పుకున్న డ్రీమ్ 11 వరకు.. ఒక్కోదాన్ని ఒక్కోలా బ్యాడ్‌లక్ వెంటాడింది! ఇప్పుడు కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. జాతీయ కంపెనీలతో పాటు కొన్ని విదేశీ కంపెనీలు భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్‌ను కూడా బ్యాడ్‌లక్ వెంటాడుతుందా? లేదా ఆ కొత్త కంపెనీ సెంటిమెండ్ ట్రెండ్‌ను మారుస్తుందా? అని మార్కెట్‌తో పాటు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
బాబోయ్.. భారత జట్టుకు స్పాన్సర్ చేయాలా? దిగ్గజ కంపెనీలకు భయం! ప్రతిసారి ఎందుకిలా అవుతోంది?
Published on: 29-08-2025