ఆసియా కప్ 2025 టోర్నీకి భారత జట్టు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెప్టెంబర్ 4న దుబాయ్‌లో సమావేశం కానుంది. ఆటగాళ్ల సౌలభ్యం కోసం ఈసారి ముంబైలో కాకుండా నేరుగా అక్కడికే చేరుకుంటారు. సెప్టెంబర్ 10న యూఏఈతో, 14న పాకిస్తాన్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది. దులీప్ ట్రోఫీలో ఆడుతున్న ఆటగాళ్లు కూడా జట్టుతో కలుస్తారు. ఈ మెగా టోర్నీలో గెలుపే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది.
దుబాయ్‌కి విడివిడిగా టీమిండియా ప్లేయర్స్.. పాత సంప్రదాయాన్ని వదిలేయడానికి రీజన్ ఇదే
Published on: 29-08-2025