విజయవాడలో వెలుగులోకి వచ్చిన ఉగ్రకేసు దర్యాప్తు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశాలను బయటపెడుతోంది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని యువతను లక్ష్యంగా చేసుకున్న నెట్‌వర్క్ మాత్రమే కాకుండా, మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ విభాగం ద్వారా మహిళలను ప్రభావితం చేసి, ఆ తర్వాత నెట్‌వర్క్‌లో భాగం చేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.
ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఆమె విదేశీ వ్యక్తులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించినట్లు దర్యాప్తులో తేలింది. పలు దేశాలకు చెందిన వ్యక్తులు ఈ నెట్‌వర్క్‌కు మార్గనిర్దేశం చేసినట్లు అధికారులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, సందేశాల ద్వారా యువతను ఆకర్షించే విధానం అమలు చేసినట్లు వెల్లడైంది.
దర్యాప్తులో మరో కీలక అంశం ఆన్‌లైన్ శిక్షణ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుంపుల ద్వారా విధ్వంసక చర్యలకు సంబంధించిన సమాచారం పంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాల వినియోగం, దాడుల పద్ధతులపై చర్చలు జరిగినట్లు గుర్తించారు. ఈ గుంపుల్లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు సభ్యులుగా ఉన్నట్లు తేలింది.
ఇంకా సైబర్ దాడులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కీలక సంస్థలపై దాడులు చేయడం, వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై మార్గదర్శకాలు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ పూర్తి విస్తృతి, సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
విజయవాడ ఉగ్రకేసులో షాక్.. మహిళల ‘రహస్య విభాగం’ వెనుక విదేశీ నెట్‌వర్క్
4
Published on: 📅 09 Apr 2026, 09:57 AM
Reported by: 🖊
Eswar Pavan