రాష్ట్రంలో భూ హక్కుల అంశంపై కీలక మలుపు తీసుకొస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. 2016కు ముందు ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద ఇంటిపట్టాలు పొందిన లబ్ధిదారులకు వాటిని అమ్ముకునే, రిజిస్ట్రేషన్ చేసుకునే, బహుమతి పత్రంగా బదిలీ చేసుకునే హక్కు కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సుమారు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇదితో పాటు విలేజ్ సర్వీస్ ఈనాం భూముల విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. 1.37 లక్షల ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇంకా మరో లక్ష ఎకరాలకు కొత్త చట్టం ద్వారా విముక్తి కల్పించనున్నట్లు సమీక్షలో వెల్లడైంది. 2019లో జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తర్వాతి ప్రభుత్వం చట్టంగా మార్చకపోవడం వల్ల సమస్య కొనసాగిందని కూడా సమావేశంలో ప్రస్తావించబడింది.
ఫ్రీహోల్డ్ కింద ఉన్న భూముల విషయంలో కూడా ప్రభుత్వం సడలింపు దిశగా కదులుతోంది. మొత్తం 13.59 లక్షల ఎకరాల్లో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లలో మొదటి దశలో 9.25 లక్షల ఎకరాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు తెలిపింది. మిగిలిన భూములపై కూడా పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఇది కాగితాలపై నిలిచిపోయిన భూ హక్కుల సమస్యను తేలిక చేసే నిర్ణయంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం భూ రికార్డుల వ్యవస్థలో కూడా పెద్ద మార్పు తీసుకురానుంది. ప్రతి రెవెన్యూ రికార్డును డిజిటలీకరించి, భూ యజమాని మొబైల్‌కు మృదుప్రతిని పంపే విధానాన్ని అమలు చేయనుంది. ఆధార్, ఈకేవైసీ ఆధారంగా యజమాని తన రికార్డును తానే నిరోధించే సదుపాయం కల్పించనుంది. అలాగే బ్లాక్‌చైన్ సాంకేతికంతో రికార్డులను భద్రపరచడం ద్వారా యజమానికి తెలియకుండా రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి కూడా గడువు నిర్ణయించారు. 2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి, 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వీటిలో ఇంకా పంపిణీ చేయాల్సిన 80 లక్షల పాస్‌పుస్తకాలను జులై నుంచి మార్చి మధ్యలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రకటన స్థాయిలో కాకుండా అమలు వేగంపైనే ఇప్పుడు పరీక్షకు రానుంది.
7
75 లక్షల కుటుంబాలకు భూ హక్కుల ఊరట.. పట్టాలు అమ్మకం, రిజిస్ట్రేషన్‌కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
5
Published on: 📅 09 Apr 2026, 06:52 AM
Reported by: 🖊
Eswar Pavan