ప్రపంచ టెక్ రంగంలో కీలక వ్యక్తిగా ఉన్న ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై జరిగిన దాడి కలకలం రేపుతోంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆయన నివాసంపై తెల్లవారుజామున 4:12 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మోలటోవ్ కాక్‌టెయిల్ విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడితో ఇంటి గేటుకు మంటలు అంటుకున్నాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.
అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఘటన సమయంలో శామ్ ఆల్ట్‌మన్ ఇంట్లో ఉన్నారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అంటే భద్రతా వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవుతున్నాయి. ఇంత పెద్ద టెక్ నాయకుడి ఇంటిపై ఇలాంటి దాడి జరగడం సాధారణ విషయం కాదు.
ఇక్కడే విషయం మరింత సీరియస్ అవుతోంది. ఈ ఘటన తర్వాత ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి కూడా నిప్పు పెడతామంటూ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని ధృవీకరించగా, దర్యాప్తులో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. అంటే ఇది ఒక వ్యక్తిగత దాడి మాత్రమేనా, లేక పెద్ద టార్గెట్ ప్లాన్‌లో భాగమా అన్న అనుమానం పెరుగుతోంది.
ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 20 ఏళ్ల యువకుడిని అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. అయితే అతడి ఉద్దేశం, వెనుక ఉన్న కారణాలు ఇంకా బయటకు రాలేదు. టెక్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఓపెన్‌ఏఐపై ఇలాంటి దాడులు జరగడం భద్రతా పరంగా పెద్ద హెచ్చరికగా మారింది.
శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోలు బాంబు దాడి.. ఓపెన్‌ఏఐకి బెదిరింపులు!
10
Published on: 📅 11 Apr 2026, 11:36 AM
Reported by: 🖊
Eswar Pavan