మైనర్‌పై

మైనర్‌పై అత్యాచారం కేసు.. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు

Published on: 22-10-2025

నల్గొండలోని పోక్సో కోర్టు మైనర్‌పై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు గురజాల చందుకుకు 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 75 వేల జరిమానా విధించింది. నిందితుడు మైనర్‌ను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడని కోర్టు పేర్కొంది. 2022లో ఈ కేసు నమోదైంది. కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పును వెలువరిస్తూ, బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందించాలని కూడా ఆదేశించారు.

Sponsored