బస్తీ దవాఖానాలపై రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ వంటి నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లేలా చేయడాన్ని దురదృష్టకరం అన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని, నిత్యం 45 వేల మందికి సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చడానికి కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు.