త్వరలోనే

త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి పంటలకు నీళ్లిస్తాం: మంత్రి పొన్నం

Published on: 22-10-2025

మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు కిసాన్ మొబైల్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. పత్తికి ప్రస్తుతం రూ. 8,100 మద్దతు ధర ఉందని చెప్పారు. రైతుల నుంచి వరి, మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేస్తామని వివరించారు. ఆయిల్ పామ్, హార్టికల్చర్ వంటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి, పంటలకు నీరందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Sponsored